13 May, 2026 | 1:32 AM

జ్యోతిష్మతి విద్యార్థినికి రూ.6.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం

13-05-2026 12:00 AM

ముకరంపుర, మే 12 (విజయ క్రాంతి): కరీంనగర్లోని జ్యోతిష్మతిలో చివరి సంవత్సరం సిఎస్‌ఇ విద్యార్థిని జునైరా అంబర్ ప్రముఖ సంస్థ ఒటోమెయిట్ ఏఐ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎస్ ఓ సి అనలిస్ట్ ఉద్యోగాన్ని సాధించింది. ఈ సంస్థ ద్వారా ఆమెను అల్సులైమాన్ గ్రూప్, సౌదీ అరేబియా కు నియమించగా, సంవత్సరానికి 6.6 లక్షల రూపాయల వేతన ప్యాకేజీ లభించింది. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ జే సాగర్ రావు, సెక్రటరీ, కరస్పాండెంట్ జే సుమిత్ సాయి, ప్రిన్సిపల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ అకాడెమిక్స్, ఆడిట్ డాక్టర్ పి కె వైశాలి విద్యార్థినిని అభినందించారు.