పూర్వ విద్యార్థుల సమ్మేళనం
08-06-2026 01:03 AM
చేగుంట, జూన్ 7 : చేగుంట మండలంలోని మక్కరాజ్ పేట్ ప్రభుత్వ పాఠ శాల 2010 -2011 పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సమ్మేళనానికి పూర్వ ఉపాధ్యాయులు ఫ్రాన్సిస్ శౌరి, చల్లా లక్ష్మణ్, జనార్దన్ రెడ్డి, శ్రీధర్ పాల్గొని, పూర్వ విద్యార్థులతో అప్పటి మధుర జ్ఞాపకాలను అందరూ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పూర్వ ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమ శిక్షణ ఉన్నప్పుడే, వారు ఉన్నత స్థాయిలో ఉంటారని, జాతీయ భావాన్ని, దేశభక్తిని కలిగి ఉండి, అ భావాలను భవిష్యత్ తరాల కూడా అందించాలని, మత్తు పదార్థాలను దూరంగా ఉండాలి అని వారన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






