18 April, 2026 | 9:56 PM

Breaking News

అ'పూర్వ' వేడుక

08-06-2025 08:25 PM

కరీంనగర్ (విజయక్రాంతి): 20 ఏండ్ల తర్వాత ఆ విద్యార్థులంతా కలుసుకున్నారు... పది తర్వాత తమ చదువులు, జీవితాల్లో స్థిరపడేందుకు పడ్డ కష్టాలను ఒకరికొకరు చెప్పుకున్నారు. బడిలో చిన్ననాటి అనుభవాలను నెమరు వేసుకొన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) సైదాపూర్ మండలం పెర్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004-05 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయులు, తమ మిత్రులతో అనుబంధాన్ని నెమరు వేసుకొన్నారు. ఉపాధ్యాయులు సత్యం, లక్ష్మణ్, సత్యనారాయణ, సుధాకర్, శాస్త్రి, శ్రీనివాస్ కు విద్యార్థులు పాద పూజ చేశారు.