calender_icon.png 9 November, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం

09-11-2025 08:33:10 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలో బెల్లంపల్లిలోని జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్(ZPHS) లో 1975 నుంచి 1988 వరకు చదివిన ఎస్ఎస్సి బ్యాచ్ (SSC BATCH) పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. 14 ఎస్ ఎస్ సీ (SSC) పూర్తి చేసిన బ్యాచ్ (BATCH) విద్యార్థులు ఒక చోటుకు చేరి ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. రోజంతా ఆనందోత్సవాల మధ్య గడిపారు.

అనంతరం ఆనాటి గురువులు(TEACHERS), ప్రధానోపాధ్యాయు(HM)లు కస్తూరి దేవరాజ్, డైనా, కళావతి, సరోజ లక్ష్మి, కమల కుమారి, స్వర్ణలత, కాంతయ్య, రాజయ్య, రామ్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, ప్రేమ్ సాగర్ లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు భాగ్యలక్ష్మి, జయశీల, వంగల సత్యవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 14 బ్యాచ్ ల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.