27 April, 2026 | 1:48 AM

వేర్వేరు చోట్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

27-04-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): శ్రీ వాసవి విద్యా మందిర్ తెలుగు మీడియం 2012-13 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఎస్‌ఎం గార్డెన్స్లో నిర్వహిం చారు. 12 సంవత్సరాల తర్వాత తోటి మిత్రు లు కలుసుకోవడంతో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల యా జమాన్య సభ్యులు మహేశ్వర్ రావు, ప్రసాద్, రాజ్ కుమార్, దాసరి సురేష్, కుమార్, అజయ్లతో పాటు ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో సన్మానించారు. 

ఆరోజులు.. మళ్లీ రావూ..

మంచిర్యాలలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర  పాఠశాల 2002--03 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆది వారం ఘనంగా నిర్వహించారు. 23 ఏండ్ల తర్వాత నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో  సందడి చేశారు.