27 April, 2026 | 1:51 AM

క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ పోటీలు

27-04-2026 12:00 AM

క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట 

సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ పోటీలను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు

సుల్తానాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలనే సంకల్పంతో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కీర్తిశేషులు అల్లాడి అరవిందరావు స్మారక ర్థం సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎస్ పి ఎల్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విజయ రమణారావు క్రీడలను ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వేసవి సమయంలో యువత పెడదోవ పట్టవద్దనే సంకల్పంతో యువతలో దాగివున్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల తరహాలో 8 టీములు ఎన్నుకోబడి పోటీలలో పాల్గొంటారని అన్నారు. ప్రతి ఒక్క టీం 7 మ్యాచులు ఐపీఎల్ తరహాలోఆడతయన్నారు.

గెలుపొందిన క్రీడాకారులకు గర్రెపల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి సందీప్ రావు ప్రథమ బహుమతి లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి 50 వేల రూపాయలు తోపాటు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ క్రీడలు కొనసాగడం శుభ పరిణామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, మున్సిపల్ కౌన్సిలర్లు, కమిషనర్ టి, రమేష్ , మాజి ఎంపీటీసీ సూర శ్యామ్,తాళ్లపల్లి మనోజ్ గౌడ్, నిర్వాహకులు సంజీవ్, క్రాం తి, వేముల అనిల్, సతీష్, సిద్ధా తిరుపతి, అమ్మిరిశెట్టి తిరుపతి తోపాటు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.