28 February, 2026 | 10:27 AM

నూతన ఎయిర్ చీఫ్ మార్షల్‌గా అమర్ ప్రీత్ సింగ్

21-09-2024 04:36 PM

న్యూఢిల్లీ: ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ తదుపరి ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా నియమితులయ్యారు. 1984లో ఎయిర్ ఫోర్స్ ఫైటర్‌ పైలట్‌గా అమర్ ప్రీత్ ఎంపికయ్యారు. ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా ఉన్నారు. వాయుసేనాధిపతిగా ఈ నెల 30న అమర్ ప్రీత్ బాధ్యతలు చేపట్టనున్నారు. 40 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి సెప్టెంబర్ 30, 2024న పదవీ విరమణ చేయనున్నారు.