అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెంటర్ కమిటీ, లుంబిని దీక్షభూమి అభివృద్ధి సొసైటీ ఆధ్వర్యంలో సెంటర్ కమిటీ ఎన్నికల ప్రక్రియను ప్రకటించారు. కమిటీ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గం పదవీకాలం ముగిసి మూడవ సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటివరకు ఎన్నికలు నిర్వహించలేకపోయామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. సెంటర్ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాల 69 గ్రామాల బౌద్ధ బంధువులు, గ్రామాల అధ్యక్షులు, సమాజ పెద్దలు ఈ ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల షెడ్యూల్ :
నామినేషన్ల స్వీకరణ: ఏప్రిల్ 3 వరకు సాయంత్రం 5 గంటల వరకు
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 5
గుర్తుల కేటాయింపు: ఏప్రిల్ 6 సాయంత్రం 5 గంటలకు
ఎన్నికల ప్రచారం: ఏప్రిల్ 7 నుండి 10 వరకు
ఓటింగ్: ఏప్రిల్ 11 (శనివారం) ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు
ఫలితాల ప్రకటన: అదే రోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్లు ఆసిఫాబాద్‌లోని లుంబినీ దీక్షభూమి వద్ద ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకత్వాన్ని ఎన్నుకుని సెంటర్ కమిటీని బలోపేతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.




