9 April, 2026 | 1:19 PM

అంటరానితనం, అణచివేత నిర్మూలనకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిది

02-11-2025 08:12 PM

బిఆర్ఎస్ మండల కార్యదర్శి బొడిగె శ్రీనివాస్ గౌడ్..

ఘట్ కేసర్ (విజయక్రాంతి): అంటరానితనం, అణచివేత నిర్మూలనకు అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిదని బిఆర్ఎస్ పార్టీ ఘట్ కేసర్ మున్సిపల్ కార్యదర్శి బొడిగె శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 238వ వారం నిత్య పూలమాల కార్యక్రమం ఆదివారం ఘట్కేసర్ పట్టణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొడిగె శ్రీనివాస్ గౌడ్ విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని మనం అందరం ముందుకి తీసుకెళాల్సిన అవసరం ఉన్నదన్నారు.

సామజిక అణిచివేతలని, అంటరానితనాన్ని, అణిచివేత నిర్ములనకి అంబెడ్కర్ చేసిన కృషి వెలకట్టలేనిదని అన్నారు. అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త, సామజిక తత్వవేక్త అని కీర్తించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లోని పేదలు అందరూ కలిస్తే బహుజన రాజ్యాధికారం రావడం ఖాయం అన్నారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్య పరుస్తున్న మీసాల అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేకల దాసు, నాయకులు కె. నర్సింగ్ రావు, బండారి రాందాస్, కె. సత్యం, మీసాల రాజేష్ కుమార్, తాల్క రాములు, బాలానగర్ సురేష్ గౌడ్, ఇ. జగదీష్, తోక రాజు, గంగారాం, అంజయ్య, టి. శ్రీరామ్, ఎస్. కృష్ణంరాజు, ఎం. సంతోష్, సి. ఆనంద్, సి. నిఖిల్, ఇ. విష్ణు, డి. శివ కృష్ణ, సి. ముఖేష్, లలిత్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు.