calender_icon.png 3 November, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ జాగృతిలో చేరికలు

02-11-2025 08:14:32 PM

కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత..

మేడిపల్లి (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ జాగృతిలో కల్వకుంట్ల కవిత సమక్షంలో, చెంగిచెర్ల కేవైసీస్ రాష్ట్ర అధ్యక్షుడు, పూలే ఫ్రంట్ రాష్ట్ర కో కన్వీనర్ గొరిగే నరసింహ కురుమ 200 మందితో తెలంగాణ జాగృతి లో  ఆదివారం చేరడం జరిగింది. ఈ సందర్భంగా కవిత  కండువా కప్పి ఆహ్వానించారు. కవిత మాట్లాడుతూ, నరసింహ లాంటి వ్యక్తులు జాగృతిలో చేరడం ఆనందం కలిగించిందని, మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యంగా త్రాగునీరు సమస్య కొన్ని సంవత్సరాలుగా ఉందని, సమస్య పరిష్కరించడానికి, జాగృతి తరుపున  కృషి చేసి మంచి నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా వారితోపాటు వచ్చిన వారందరినీ జాగృతిలో చేర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గొరిగి నరసింహ మాట్లాడుతూ, కవిత చేస్తున్న పోరాటాలకు ఆకర్షితుడైన, తన మిత్రులతో కలిసి జాగృతిలో చేరడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఒకరిని జాగృతి  ఉప్పల్ ఇన్చార్జిగా, ఇంకొకరిని షాద్నగర్ ఇన్చార్జిగా కవిత నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గొరిగే రాధిక, బాపురాజు, శివకుమార్, తిరుపతి రాజు ,వెంకటేష్ ,సతీష్ ,సత్యనారాయణ, యాకుబ్ పాషా, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్, కమలాకర్, సిద్ధులు, గుజ భాస్కర్, గుంటి శ్రీను, మౌనిక, వరలక్ష్మి, మాధవి, శారద తదితరులు జాగృతిలో చేరడం జరిగిందని తెలిపారు.