06-12-2025 08:46:31 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం రేకుర్తి 18వ డివిజన్ 40వ బూత్ లో శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి బిజెపి పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో 39 బూత్ అధ్యక్షులు నాంపల్లి శంకర్, 38 బూత్ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, 43 బూత్ అధ్యక్షులు గోదారి నరేష్, తిరుమల్ రెడ్డి, పరుశురాములు సంజీవరెడ్డి, జాడి స్టాలిన్, అస్తపురం శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.