calender_icon.png 6 December, 2025 | 9:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణగారిన వర్గాలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహనీయుడు

06-12-2025 08:49:00 PM

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్..

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.. 

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డా.బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పిస్తూ, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అందించిన మహా నాయకుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచన విధానంతో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని అన్నారు. అన్ని రంగాలతో పాటు చట్టసభల్లో అనగారిన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించాడని అన్నారు.

జనాభా ఎంతో రిజర్వేషన్లు అంతే అనే నినాదంతో రాష్ట్రంలో కుల గణన తర్వాత తేలిన లెక్కల ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన పార్టీగా దేశంలో మొదటి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా అందరూ అంబేద్కర్ ఆలోచన విధానాల ప్రకారం నడుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తో పాటు మాజీ డిసిసి అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, సిరిసిల్ల బ్లాక్ అద్యక్షులు సూర దేవరాజు, పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, ఎస్సీ సెల్ కన్వీనర్ ఆకునూరి బాలరాజు, మంగ కిరణ్, మాజీ కౌన్సిలర్లు రాగుల జగన్, రెడ్డి నాయక్, నాయకులు బొప్ప దేవయ్య, చిందం శ్రీనివాస్, మైనారిటీ నాయకులు సాహెబ్, దర్మేందర్, రాగుల రాములు, దత్తు, శ్రీరాముల వెంకటేశం, హైమద్, దుబాల వెంకటేశం, అకేని సతీశ్, బూర యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.