calender_icon.png 7 December, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

06-12-2025 10:01:05 PM

కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి..

కోదాడ: భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు అని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంపాటి శ్రీను ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డులో పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, కాంపాటి శ్రీను, కందుల కోటేశ్వరరావు, చింతాబాబు మాదిగ, గంధం యాదగిరి, పంది తిరపయ్య, బషీర్,, గంధం పాండు, గుండపంగు రమేష్, పాలూరి సత్యనారాయణ, చౌడం హనుమంతరావు, బాజాన్, అలీ భాయ్, రహీం, ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.