calender_icon.png 6 December, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదుపుతప్పి లారీని ఢీకొట్టిన ట్రాక్టర్ వ్యక్తి అక్కడికక్కడే మృతి

06-12-2025 09:59:15 PM

శామీర్ పేట్: అదుపుతప్పి లారీని ఢీ కొట్టిన ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అలియబాద్ నుండి శామీర్ పేట్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ ఎక్కి శామీర్ పేట్ నుండి కరీంనగర్ వైపు వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహారాష్టకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ఆకాష్(30) అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన రాజీవ్ రహదారిపై కావడంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను నిల్వరించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.