06-12-2025 08:54:25 PM
బహుజన సేన నేతలు..
వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో బహుజన సేన రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ “డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భౌతికంగా లేకున్నా, భారత రాజ్యాంగ రూపంలో అంబేద్కర్ బ్రతికే ఉన్నారు. సమాన హక్కుల కోసం వారి కుటుంబాన్నే త్యాగం చేసిన మహనీయుడు బాబాసాహెబ్” అని పేర్కొన్నారు. సమాజం ఆయన ఆశయాలను ఆచరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిలుక రమేష్, పిట్ల సతీష్, గుడిసె మనోజ్ కుమార్, జింక శ్రీధర్, సుంకపాక వినయ్, మల్లారం హరీష్, నేదూరి రాజు, శ్రీకాంత్, నాగేష్, రాము తదితరులు పాల్గొన్నారు.