calender_icon.png 6 December, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరుడు సాయి ఈశ్వర చారి త్యాగం వెలకట్టలేనిది

06-12-2025 08:59:06 PM

బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో నివాళులు..

వేములవాడ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల అమలులో జాప్యానికి నిరసనగా పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతి యత్నం చేసిన రంగారెడ్డి జిల్లా యువకుడు సాయి ఈశ్వర చారి శుక్రవారం మరణించగా, ఆయన కుటుంబంపై తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాదులో క్యూ న్యూస్ కార్యాలయం వద్ద గురువారం ఆత్మాహుతి యత్నం చేసి, ఎంజీఎంహెచ్ లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. భార్య, ముగ్గురు చిన్నపిల్లలను విడిచిపెట్టి అమరుడైన చారి త్యాగం బీసీ సమాజాన్ని కలిచివేసింది.

ఈ సందర్భంగా బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొండ దేవయ్య పటేల్, ఉమ్మడి కరీంనగర్–ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు పొలాస నరేందర్ ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లులను వెంటనే పార్లమెంట్‌లో ఆమోదించి షెడ్యూల్ 9లో చేర్చాలని, ఇందుకు తెలంగాణ ఎంపీలు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు.