calender_icon.png 6 December, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీడియా సెంటర్ ను సందర్శించిన జిపి ఎలక్షన్ అబ్జర్వర్ మధుకర్ బాబు

06-12-2025 08:51:51 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు-2025 సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ(ఎంసిఎంసి) పనితీరును శనివారం సాయంత్రం గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు మధుకర్ బాబు కూచిపూడి పరిశీలించారు. ఈ సందర్భంగా మధుకర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రతిరోజు ప్రసారమయ్యే, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో ఎన్నికలకు సంబంధించి వస్తున్న వార్త కథనాలను శ్రద్ధగా పరిశీలించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించిన ప్రకారం గమనిస్తూ ఉండాలని నివేదిక రూపొందించాలని డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్ కు సూచించారు. ఆయన వెంట కార్యాలయ సిబ్బంది కాల్వ రాము, ఆర్ ఐ కృష్ణ ప్రసాద్, తదితరులు ఉన్నారు.