15 April, 2026 | 3:57 AM

హర్వెస్ట్ పాఠశాలలో అంబేద్కర్ జయంతి

15-04-2026 01:21 AM

నివాళులర్పించిన కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ తదితరులు

ఖమ్మం, ఏప్రిల్ 14(విజయక్రాంతి):డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని ఖమ్మం నగరంలోని హార్వెస్ట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహామేధావి అంబేద్కర్ కృషిని స్మరిస్తూ కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పి.రవిమారుత్ మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం, విద్య, న్యాయం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన ఆశయాలను అనుసరించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు.

ఆర్థికాంశాలమీద సమగ్రమైన అవగాహనతో ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ అనే పుస్తకంలో అనేకానేక అంశాలను తెలియజేసిన అంబేద్కర్ జీవిత్ర, ఆయన చేసిన సేవలపై ప్రసంగాలను స్మరించుకోవడం సముచితం అన్నారు. ఈ రోజును దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం అంబేద్కర్‌కి మనమిచ్చే ఘనమైన గౌరవ వందనం అన్నారు.

ప్రిన్సిపాల్ ఆర్.పార్వతీరెడ్డి మాట్లాడుతూ 1891లో మధ్యప్రదేశ్‌లో మహౌ ప్రాంతంలో జన్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశ చరిత్రలో గొప్ప నాయకుడిగా నిలిచారు. ఆయన కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, సమానత్వం, న్యాయం, మానవ హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు. బాల్యంలో ఎన్నో అసమానతలను ఎదుర్కొన్నప్పటికీ చదువులో ఎప్పుడు ముందుండేవాడని,తాను దేశస్వాతంత్య్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.