ఘనంగా అంబేద్కర్ జయంతి
లక్ష్మణ చందా,(విజయక్రాంతి): మండల కేంద్రం లోని తాసిల్దార్ ఎంపీడీవో కార్యాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అలాగే పాటు అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల వద్ద అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ జయంతి(Ambedkar Jayanti ) ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ మనస్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు వెళ్లాలని అన్నారు. నేడు జరుగుతున్న ఈ రిజర్వేషన్లు అంబేద్కర్ వల్లనేనని గుర్తు చేశారు. కొన్నిచోట్ల సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించగా మరికొన్ని చోట్ల ర్యాలీలు అన్నదానాలు నిర్వహించారు ఈ. ఈ కార్యక్రమంలో మండల అధికారులతో పాటు ఆయా గ్రామాల సర్పంచులు వార్డు సభ్యులు ఉపసర్పంచ్లు అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు అధికారులు అనధికారులు యూత్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




