14 April, 2026 | 1:58 PM

బోడులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 11:22 AM

టేకులపల్లి, (విజయ క్రాంతి):టేకులపల్లి మండలం బోడు గ్రామంలో  పంచాయతీ సర్పంచ్ పోదేం స్వరూప- సుధీర్ ల ఆధ్వర్యంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతిని ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కి చెందిన పలువురు వార్డు సభ్యులు, బోడు గ్రామస్తులు, ఏఎస్ఐ  నాగయ్య, బోడు గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.