కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని కేటీపీఎస్ తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 621/14 ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీపీఎస్ 5,6దశలు, మేక ప్రభాకర్ రావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాల్యం నుండి కుల వ్యవస్థను ఎదుర్కొంటూనే ఉన్నత విద్యను అభ్యసించి అంటరానితనం కుల వ్యవస్థను నిర్మూలించేందుకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎనలేని సేవలను ఎన్నడూ మరువలేమని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఏడవ దశ సూర్యనారాయణ,సూపర్నెంట్ ఇంజనీర్స్ శివరాం రెడ్డి,యుగాపతి,జి రాజకుమార్ హరిలాల్ , మోక్ష వీర్, డిప్యూటీ సిసిఏ పీ.రామారావు తెలంగాణ స్టేట్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 621/14 డిప్యూటీ జనరల్ సెక్రటరీ కూరపాటి రమేష్ రీజినల్ ప్రెసిడెంట్ వరి కూటి శ్రీనివాసరావు ఆర్గనైజేషన్ సెక్రటరీ రాజయ్య , ధర్మరాజు ఏడిఈ,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.






