అంబేద్కర్ చేసిన కృషి మరువలేనిది
మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్
జిన్నారం /అమీన్ పూర్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మాజీ సర్పంచ్ సరితా సురేందర్ గౌడ్, వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్, కౌన్సిలర్లు రాజకీయ పార్టీల నాయకులు జయంతి వేడుకల్లో పాల్గొని అంబేడ్కర్ కు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సరిత సురేందర్ గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలోని అంటరానితన్నాన్ని నిర్మూలించేందుకు అంబేడ్కర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి సమన్యాయం చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు స్వాతి గణేష్ సింగ్, మల్లేష్, నవీన్, అంబేద్కర్ సంఘం నాయకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.




