15 June, 2026 | 6:16 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో చేర్పించండి   •   పల్లెల నుంచే కాంగ్రెస్ పార్టీ భలోపేతం: గ్రామ కమిటీల ఏర్పాటు వేగవంతం   •   ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే తొలగించండి   •   ప్రోగ్రాం, ఫార్మసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి   •   ప్రజావాణికి 93 దరఖాస్తులు   •   సత్వర న్యాయానికే లోక్ అదాలత్ లు   •   ధర్మపురి బస్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు   •   నాగారం గ్రామస్తులతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మీయ భేటీ   •   నాగారం మహాదేవుని ఆలయంలో తహసీల్దార్ వరలక్ష్మికి ఘన స్వాగతం   •   ఉజ్వల భవిష్యత్తుకు తొలిమెట్టు అంగన్వాడి కేంద్రాలు   •  

తాళ్లవెళ్ళాంల గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 01:35 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం తాళ్లవెళ్ళాంల గ్రామంలో రాజ్యాంగ రూపకర్త, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పజ్జూరి అజయ్ కుమార్ రెడ్డి, పజ్జూరి నరసింహా రెడ్డి, జనగాం అంజయ్య గౌడ్, సర్పంచ్ జోగు సురేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని గ్రామ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, గ్రామ ప్రజలందరి సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు జోగు రమేష్, ఉపాధ్యక్షుడు జోగు చిరంజీవి, నక్క యాదగిరి, నక్క సైదులు, నల్లవెల్లి రమేష్, జోగు నాగేష్, జోగు సందీప్, పామునుగుల్ల బుచ్చి రాములు, పామునుగుల దశరథ, జోగు అశోక్,పందుల శ్రీను, నకరికంటి నాగేష్, నల్లవెల్లి నరేష్, నక్క పవన్, పంచాయతీరాజ్ కార్యదర్శి  శ్రీనివాస్, నాగమణి, విజయ తదితరులు పాల్గొన్నారు.