15 June, 2026 | 7:21 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 01:37 PM

ముకరంపుర,(విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్  జయంతి సందర్భంగా స్థానిక టీఎన్జీవోస్ సంఘ భవనంలో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్  చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు స్మరించుకున్నారు. అలాగే జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమంలో కూడా టీఎన్జీవో నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ,  భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సమానత్వానికి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్, జిల్లా కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, తిమ్మాపూర్ అధ్యక్షులు పోలు కిషన్,  రమేష్, శంకర్ యాదవ్, సరిత, శైలజ,  తదితరులు పాల్గొన్నారు. అలాగే సంఘ సభ్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారూ