14 April, 2026 | 5:05 PM

Breaking News

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •  

కోనరావుపేటలో అంబేద్కర్ జయంతి వేడుకలు – రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ

14-04-2026 01:34 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు, సమానత్వం కోసం చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

 అనంతరం రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడటం, వేగ పరిమితులు పాటించడం వంటి నియమాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని తెలిపారు.ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రత నియమాలను పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మస్కూరి కాశీరాం  ఉప సర్పంచ్ జింక రేవతి  నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు