14 April, 2026 | 8:06 PM

మండాలపాడు ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 03:49 PM

పెనుబల్లి,(విజయక్రాంతి): మండాలపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామ సర్పంచ్ గాయం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకునే విధంగా అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన చూపిన బాటలో నడవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.