14 April, 2026 | 11:28 PM

అంబేద్కర్ స్ఫూర్తి చిరస్మరణీయం

14-04-2026 06:05 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తి చిరస్మరణీయం అని మఠంపల్లి తాహశీల్దార్ లావురిమంగా, మఠంపల్లి అభివృద్ధి అధికారి జగదీష్ కుమార్,సబ్ ఇన్స్పెక్టర్ పి.బాబు అన్నారు. మంగళవారం అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏసుమల్ల రాములు ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మఠంపల్లి మండల కేంద్రములో ఆయన విగ్రహానికి పులమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం ఎన్నటికీ మరువలేనిది అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయానికి మార్గదర్శిగా, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని కొనియాడారు.