14 April, 2026 | 11:25 PM

టిఎస్ జెయు హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా గణపనేని చంద్రశేఖర్

14-04-2026 06:07 PM

హన్మకొండ,(విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా గణపనేని చంద్రశేఖర్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు నారాగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ సంయుక్తంగా ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధ్యక్షుడు గణపనేని చంద్రశేఖర్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని, జిల్లాలో ఉన్న మీడియా ప్రతినిధుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని, అలాగే టీఎస్ జేయు సంస్థను మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల ఐక్యత కోసం కృషి చేస్తానని తెలిపారు. తన మీద నమ్మకంతో అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు నారాగోని పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దొరి హరికృష్ణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.