సీఆర్‌పీఎఫ్ క్యాంపస్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్
సీఆర్‌పీఎఫ్ డీఐజీపీ డాక్టర్ బి.వీర్రాజు
జవహర్‌నగర్, జూలై 12 (విజయక్రాంతి): సీఆర్పిఎఫ్ క్యాంపస్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కు ఎంపికైందని నిరుద్యోగ యువతీ యువకులకు చక్కటి అవకాశం అని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిఆర్పిఎఫ్ డిఐజిపి డాక్టర్ బి. వీర్రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి ఇంటర్ మధ్యలో చదువు ను ఆపేసిన వారికి సువర్ణ అవకాశమని దూరవిద్య ద్వారా చదువును కొనసాగించవచ్చు అని తెలిపారు.
బిఎ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సులు ఏర్పాటు చేశారన్నారు. స్టడీ సెంటర్ కు కోఆర్డినేటర్ గా సిఆర్పిఎఫ్ వైస్ ప్రిన్సిపల్ హరిశంకర్ ను నియమించారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 31 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారిని సంప్రదించాలని కోరారు.






