calender_icon.png 19 December, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు: రాష్ట్రపతి

19-12-2025 11:51:34 AM

హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్ పర్సన్ల జాతీయ సదస్సులో  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) పాల్గొన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఛైర్ పర్సన్ల సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. నియామకాల విషయంలో సర్వీస్ కమిషన్లు వేగంగా స్పందిస్తున్నాయన్నారు. 1950 తర్వాత యూపీఎస్సీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు మొదలైందని రాష్ట్రపతి తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ల(Public Service Commissions) విషయంలో అంబేద్కర్ కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.

నియామకాల్లో ఎదురవుతున్న సవాళ్లకు త్వరితగతిన పరిష్కారం అవసరమన్నారు. నియామకాల్లో పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి సూచించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma), మంత్రి సీతక్క, టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం, యూపీఎస్‌సీ ఛైర్మన్ అజయ్ కుమార్ హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై సదస్సులో చర్చించారు.వివిధ రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నారు.