19-12-2025 11:57:31 AM
అక్కడికక్కడే ఒకరు మృతి
మరొకరికి తీవ్ర గాయాలు
సంఘటన స్థలం వద్ద మిన్నంటిన బంధువుల రోదనలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి 'కొఠారి గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం కొఠారి గ్రామానికి చెందిన మహేష్(18),జ్యోతిరామ్ ధనురా గ్రామం నుండి ఆసిఫాబాద్ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు.
పత్తిలోడుతో వెళుతున్న ట్రాక్టర్ వెనుక భాగంలో బైక్ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా జ్యోతిరామ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి దీంతో వెంటనే జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.మహేష్ మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి.