19-12-2025 10:23:51 AM
యశోద హాస్పిటల్ కు తరలింపు ..
పరిస్థితి విషమం.
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా(Vikarabad District) కోట్పల్లి మండల కేంద్రానికి నూతనంగా ఎన్నిక అయిన సర్పంచ్ భర్తపై హత్యాయత్నం జరిగింది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజుల క్రితం జరిగిన సర్పంచ్ ఎన్నికలలో గ్రామానికి చెందిన జంగం సంగయ్య స్వామి భార్య జంగం బసమ్మ సర్పంచ్ గా గెలుపొందారు. అయితే గత రాత్రి 10:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా దాడి చేశారు. తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే వికారాబాద్ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని హైటెక్ సిటీ యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు సంగయ్య పై దాడి చేసిన వ్యక్తులను కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు