15 July, 2026 | 2:37 PM

Breaking News

మందకృష్ణకు సమస్యలు విన్నవించిన ఇచ్చోడ నాయకులు   •   సర్ ప్రక్రియను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్   •   సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్   •   లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •  

సర్ ప్రక్రియను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్

15-07-2026 02:35 PM

తాంసి, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి, హస్నాపూర్ గ్రామాల్లో చేపడుతున్న SIR ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి బుధ వారం పరిశీలించారు. గ్రామాల్లో పోలింగ్ స్టేషన్ల వారిగ జరుగుతున్న ప్రక్రియ వివరాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఫారాలు నింపకపోతే ఓటు పోయే ప్రమాదం ఉందని, BLOలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండి ఒక్క ఓటరు నష్టపోకుండా చూడాలని సూచించారు.

రానున్న రోజుల్లో ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకం ఓటు హక్కు వినియోగంపైనే ఆధారపడి ఉంటుందని, ఓటు హక్కును వినియోగించుకోని వారికి ప్రభుత్వ పథకాలు అందవని ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట ఆత్మ చైర్మన్ కౌడల నారాయణ, ఏఎంసి సభ్యులు ధనుంజయ్, కంది చక్రధర్ రెడ్డి, హస్నాపూర్ సర్పంచ్ ఎల్మ లింగ రెడ్డి, చిలకూరి వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్, చందర్ రెడ్డి, గడ్డం నవీన్, బెండ జైసుధ, వడ్డాడి సర్పంచ్ గంగాధర్, ఉప సర్పంచ్ రమాకాంత్, దశాంత్, శ్రీకాంత్, వాకి, దేవరీ గంగాధర్, హన్మాండ్లు, గంగయ్య, అఫ్రోజ్ తదితరులున్నారు.