15 July, 2026 | 2:37 PM

Breaking News

మందకృష్ణకు సమస్యలు విన్నవించిన ఇచ్చోడ నాయకులు   •   సర్ ప్రక్రియను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్   •   సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్   •   లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •  

మందకృష్ణకు సమస్యలు విన్నవించిన ఇచ్చోడ నాయకులు

15-07-2026 02:36 PM

ఇచ్చోడ, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను బుధ వారం మందకృష్ణ మాదిగకు ఎంఆర్పీఎస్ నాయకులు విన్నవించారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో జరుగుతున్న పక్షపాత ధోరణి, అదే విధంగా గతంలో దళితులకు ఇచ్చిన ఇంటి స్థలాలు, పట్టణంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయం, అంబేద్కర్ భవనం విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా మందకృష్ణ మాదిగ సానుకూలంగా స్పందించి ఈ విషయాలపై ఎంపీ, ఎమ్మెల్యేలతో, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో చర్చించి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారని ఎంఆర్పీఎస్ నాయకులు వెల్లడించారు. మందకృష్ణను కలిసిన వారిలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు దుబ్బాక సుభాష్ మాదిగ, సిరిసిల్ల భూమయ్య మాదిగ, కాశి పాక విష్ణు మాదిగ, మచ్చ గంగయ్య మాదిగ, కల్లేపల్లి రాజు మాదిగ, మండల అధ్యక్షులు చిట్టి రవి మాదిగ, కొల్లూరు గంగయ్య మాదిగ, జుట్టు మల్లేష్ మాదిగ, ఆరెపల్లి రవి మాదిగ, బేడ బుడగ జంగం సభ్యులు కడమంచి లక్ష్మణ్, ముదుగు శిను, సాయి తదితరులున్నారు.