1 April, 2026 | 2:34 AM

పెను ప్రమాదంగా అమెరికా సామ్రాజ్యవాద పోకడలు

01-04-2026 12:00 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా

భద్రాద్రి కొత్తగూడెం/లక్ష్మీదేవిపల్లి , మార్చి 31 (విజయక్రాంతి): అమెరికా సామ్రాజ్యవాద యుద్ధ పోకడలు ప్రపంచ శాంతికి పెనుప్రమాదంగా మారుతోందని, ఈ యుద్ధం భారీ ప్రాణ నష్టానికి, ప్రాంతీయ అస్థిరత్వానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నానికి దారితీసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ సాబీర్ పాషా అన్నారు. లక్ష్మీ దేవిపల్లి మండలం లోతువాగు ఎస్‌ఆర్ గార్డెన్స్ లో మంగళవారం జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమెరికా, ఇజ్రాయేల్ దేశాలు ఇరాన్‌పై ఏకపక్ష యుద్ధం చేస్తున్నాయని, దీని వల్ల అమయాకులు సమిదలవుతున్నారని, సుమారు 3,300 మందిని పొట్టన పెట్టుకున్నారని, పసి పిల్లలను కూడా వదల్లేదని మండిపడ్డారు.  కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, జర్నలిస్టుల సమస్యలపై శాసన సభ్యలు కూనంనేని సాంబశివరావు తన గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తున్నారని, చట్ట సభల్లో మన ప్రాతినిధ్యం పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. 

ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వర రావు, మిరియాల రంగయ్య, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్’తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు కే సారయ్య, సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీ కుమారి, రేసు ఎల్లయ్య, వీసంశెట్టి పూర్ణచంద్రరావు, అడుసుమిల్లి సాయిబాబా,, మండల కార్యదర్శులు, జిల్లా సమితి సభ్యులు పాల్గొన్నారు.