‘బొగత’లో పర్యాటకుల సందడి..
13-07-2026 01:19 AM
వెంకటాపురం (నూగూరు)/వాజేడు/జూలై 12 (విజయక్రాంతి): తెలంగాణ నయాగార జలపాతంగా పేరొందిన బొగత జలపాతం ఆదివారం పర్యాటకులతో సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు జలపాతంలో స్నానాలు చేస్తూ కేరింతలతో ఎంతో ఉల్లాసంగా గడిపారు.
ఆదివారం సెలవు దినం కావడంతో జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు భారీగా వచ్చారు. కాగా ఎప్పటికప్పుడు పర్యాటక శాఖ విభాగం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విభాగం అధికారులు లోతట్టు ప్రాంతాలపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యాటకులు లోతట్టు ప్రాంతాలపై వెళ్లకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.






