30 August, 2026 | 9:42 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

అమెరికా సంచలనం

25-05-2024 02:07 AM

హోస్టన్: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న అమెరికా సంచలనం నమోదు చేసింది. స్వదేశంలో జరగనున్న పొట్టి ప్రపంచకప్‌నకు ముందు బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో మ్యాచ్‌లో అమెరికా 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. తద్వారా తొలి మ్యాచ్ విజయం గాలివాటం కాదని నిరూపించడంతో పాటు మరో మ్యాచ్ మిగిలుండగానే 2 సిరీస్ పట్టేసింది. మొదట అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మోనాంక్ పటేల్ (38 బంతుల్లో 42, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఆరోన్ జోన్స్ (34 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. బంగ్లా బౌలర్లలో షరీఫుల్, ముస్తఫిజుర్, రిషాద్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. నజ్ముల్ (34 బంతుల్లో 36), షకీబ్ (23 బంతుల్లో 30) పోరాడినా ఫలి తం లేకపోయింది. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్ 3 వికెట్లు తీయగా.. సౌరబ్, షాడ్లీలు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.