30 August, 2026 | 8:37 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

జొకోకు షాక్

25-05-2024 02:10 AM

జెనీవా: టెన్నిస్ ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు షాక్ తగిలింది. జెనీవా ఓపెన్‌లో ఈ సెర్బియా వీరుడు సెమీస్‌లో వెనుదిరిగాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో జొకోవిచ్ 4 6 1 టోమస్ మెక్‌హక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలయ్యాడు. కాగా తన కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన మెక్‌హక్‌కు ఇదే తొలి ఏటీపీ టూర్ ఫైనల్ కావడం విశేషం. మెక్‌హక్‌కు తొలి సెట్‌ను కోల్పోయిన జొకోవిచ్ రెండో సెట్‌లో ఫుంజుకొని సర్వీస్ కోల్పోకుండా 6 సెట్‌ను కైవసం చేసుకున్నాడు. కానీ నిర్ణయాత్మక మూడో రౌండ్‌లో మెక్‌హక్ పోరాటానికి తలవంచిన జొకోవిచ్ పరాజయం చవిచూశాడు. ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహకంగా భావించిన జెనీవా టోర్నీలో విజేతగా నిలవాలనుకున్న జొకోవిచ్‌కు నిరాశే ఎదురైంది. ప్రతిష్ఠాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.