18 April, 2026 | 1:05 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

అమీన్ పూర్ ప్ర‌భుత్వ భూములను కాపాడాలి

26-04-2025 09:02 PM

క‌లెక్ట‌ర్ క్రాంతి వ‌ల్లూరు..

రెవెన్యూ, మున్సిప‌ల్ అధికారుల‌తో క‌లిసి ప్ర‌భుత్వ భూముల ప‌రిశీల‌న‌..

ఫెన్సింగ్ వేసి.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశం..

ప‌టాన్ చెరు: అమీన్ పూర్ మండ‌లంలోని ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడాల‌ని క‌లెక్ట‌ర్ క్రాంతి వ‌ల్లూరు(District Collector Kranthi Valluru) రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. శ‌నివారం అమీన్ పూర్ మండ‌లానికి సంబంధించిన ప్ర‌భుత్వ భూముల వివ‌రాల మ్యాప్ ను ఆమె ప‌రిశీలించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ... స‌ర్వే నంబ‌ర్ 993 ప్ర‌భుత్వ భూమిని గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాల‌న్నారు.  ప్ర‌భుత్వ భూముల్లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల కోసం కేటాయించిన స్థ‌లాల వ‌ద్ద బోర్డులు ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ప్ర‌భుత్వ భూముల‌ను ప్ర‌భుత్వ అవ‌స‌రాల కోస‌మే వినియోగిస్తార‌ని, వాటికి ఫెన్సింగ్ వేసి ర‌క్ష‌ణ కల్పించాల‌ని ఆదేశించారు. ప్ర‌భుత్వ భూముల వ‌ద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల‌న్నారు. ఆర్డీవో ర‌వీంద‌ర్ రెడ్డి, త‌హ‌సీల్దార్ వెంక‌ట‌స్వామి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ జ్యోతిరెడ్డి, రెవెన్యూ, మున్సిప‌ల్ అధికారులు పాల్గొన్నారు.