చరిత్ర సృష్టించిన అమిత్ సంఘీ
- ఎన్‌ఆర్‌ఏఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక
- సౌత్ రీజియన్ నుంచి తొలిసారి
హైదరాబాదు, డిసెంబర్ 4 (విజయక్రాంతి): నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) 2025-2029 పదవీకాలానికి గాను నేషనల్ బాడీ ఆఫీస్ బేరర్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలు గురువారం మోహాలి, చండీగఢ్‌లో జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమిత్ సంఘీ భారీ మెజారిటీతో ఎన్‌ఆర్‌ఏఐ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ఎన్నికయ్యారు. సదరన్ ప్రాంతం నుండి ఈ పదవికి తొలిసారిగా ప్రతినిధి ఎన్నిక కావడం విశేషం.
అమిత్ సంఘీ షూటింగ్ క్రీడా రంగంలో 25 ఏళ్లకు పైగా అనుభవం కలిగి ఉండి, ఎన్నాళ్లుగానో ఎన్‌ఆర్‌ఏఐతో అనుబంధంగా సేవలు అందిస్తున్నారు. ఆయన నాయకత్వం, పరిపాలనా నైపుణ్యం, క్రీడాభివృద్ధికి చేసిన కృషి షూటింగ్ వర్గాల నుండి విస్తృతమైన ప్రశంసలను అందుకుంది. అమిత్ సంఘీ మాట్లాడుతూ.. ‘ఈ బాధ్యత నా కర్తవ్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. దేశవ్యాప్తంగా షూటింగ్ క్రీడ అభివృద్ధికి అన్ని భాగస్వాములతో కలిసి పనిచేస్తాను’ అన్నారకు.
కలికేశ్ నారాయణ సింగ్ దేవ్-అధ్యక్షులు, ఎన్‌ఆర్‌ఏఐ, పవన్కుమార్ సింగ్-కార్యదర్శి జనరల్, మేఘాషమ్ శ్రీపాద్ భాంగ్లే హానరరీ ట్రెజరర్‌లకు టీఆరేఏ హృదయపూర్వక అభినందనలు తెలి పింది. షూటింగ్ క్రీడ అభివృద్ధిలో అమిత్ సంఘీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జే.కిరణ్ సహా ఎగ్జిక్యూటివ్ సభ్యులు అభినందనలు తెలిపారు.






