సంగం 2025 ముగింపు
క్రీక్ ప్లానెట్ స్కూల్ వీనస్ క్యాంపస్‌లో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): క్రీక్ ప్లానెట్ స్కూల్ వీనస్ క్యాంపస్ సంగం 2025 ముగింపు కార్యక్రమం పాఠశాల పదేళ్ల ప్రస్థానాన్ని ఘనంగా ప్రతిబింబిస్తూ విద్యా ప్రతిభ, సంస్కృతి, విలువల సమగ్రోత్సవంగా నిర్వహించబడింది. భారతీయ జ్ఞాన పరంపర, ప్రాచీన జ్ఞానం ఆధు నిక విజ్ఞాన సమన్వయమే భవిష్యత్ మార్గం నినాదంతో వేడుక జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత సేన అధికారి మేజర్ హర్ష వర్ధన్ చావా గని పాఠశాల ప్రిన్సిపల్ కే. డమరిస్, స్టూడెంట్ కౌన్సిల్ సభ్యులు స్వాగతం పలికారు. చైర్మన్ బొల్లినేని సీనయ్య సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
విద్యార్థి నాయకత్వ బృం దం అందించిన గార్డ్ ఆఫ్ ఆనర్ సభా వాతావరణానికి ప్రత్యేక గాంభీర్యాన్ని అందిం చింది. మేజర్ హర్ష వర్ధన్ చావా జ్ఞానం, వివేకం మధ్య తేడాను స్పష్టంగా వివరిస్తూ, జ్ఞానం సమాచారమైతే, వివేకం దానిని సమాజ హితానికై వినియోగించే శక్తి అని చెప్పారు. 150 ఏళ్ల ‘వందే మాతరం‘కు పాఠశాల తరఫున అరుదైన నివాళి వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, అతిథులు ఆకాశతీగల క్రింద ఒకటై వందే మాతరం ఆలపించిన క్షణం సభలో దేశభక్తి ఊపిరితో నింపింది. ప్రిన్సిపాల్ డమరిస్ వార్షిక నివేదికను ఆవిష్కరించారు.
10వ తరగతి ఫలితా లు, జాతీయ స్థా యి క్రీడ విజయాలు, వివిధ విభాగాల్లో వి ద్యార్థుల సాధనలను ప్రస్తావించారు. సాం స్కృతిక వైభవం సంగీతం, నృ త్యం, నాటికల సమన్వయం ఆర్కెస్ట్రా, శాస్త్రీయజానపద నృత్యాలు, ఆధునిక ప్రదర్శ నలు, బహుభాషా గీతాలు ప్రేక్షకులను ము గ్ధులను చేశాయి.
విద్యా ప్రతిభకు పురస్కారాలు 10వ తరగతి టాపర్లను సత్కరించడం, వార్షిక హౌస్ ట్రోఫీ ప్రదానం సభకు మరింత శోభను తెచ్చాయి. చైర్మన్ బొల్లినేని సీనయ్య తన విద్యార్థి దశ జ్ఞాపకాలను పంచుకున్నారు. హెడ్ అకాడెమిక్స్ డాక్టర్ జయశ్రీ నాయర్ భవిష్యత్ కేంద్రిత, సమగ్ర, విలువలతో కూడిన విద్యపై పాఠశాల సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.






