calender_icon.png 19 June, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లుడుతండాలో అమ్మ మాట అంగన్ వాడి బాట

18-06-2025 07:59:18 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బొమ్మనపల్లి సెక్టర్ బిల్లుడు తండా అంగన్వాడి కేంద్రంలో టేకులపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ మంగతార(ICDS Project CDPO Mangatara) ఆధ్వర్యంలో బుధవారం అమ్మ మాట అంగనవాడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిడిపిఓ మాట్లాడుతూ... బడిబాట కార్యక్రమంలో మూడు సంవత్సరాల నిండిన పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో జాయినింగ్ చేసుకోవడం జరుగుతుందని, ఐదు సంవత్సరాల నిండిన పిల్లలను గవర్నమెంట్ స్కూల్లో జాయినింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఆడపిల్లలకు 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలలోపు ఉన్నవారికి పల్లి చిక్కి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండక ముందే వివాహాలు చెయ్యకూడదని, 18 సంవత్సరాలు నిండకముందే వివాహం చేసినట్లయితే ఎన్నో అనర్ధాలు వస్తాయని తల్లులకు యుక్తవయసు బాలికలకు అవగాహన కల్పించడం జరిగింది. ఆడపిల్లలు మంచిగా చదువుకొని వారి కాళ్ళ మీద వాళ్లు నిలబడిన తర్వాత వివాహాలు చేయాలన్నారు. మూడు సంవత్సరాలు నిండిన పిల్లలకు అక్షరాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి సెక్టార్ సూపర్వైజర్ కే యశోదమ్మ, అంగనవాడి టీచర్స్ బి సరోజ, అమ్మి, హెల్పర్స్ నీలా, బద్రి, తల్లులు, యుక్త వయసు బాలికలు పిల్లలు పాల్గొన్నారు.