14 June, 2026 | 4:32 PM

Breaking News

భోజన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి   •   ఆడబిడ్డల ఆత్మీయ సమ్మేళనం   •   ఆలయ నిర్మాణకు విరాళం అందజేత   •   ఎమ్మెల్యే అనుచర వర్గంపై దృష్టి పార్టీ పటిష్టతపై ప్రత్యేక సమావేశాలు.   •   అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలు సీజ్: ఎస్ఐ మోతిరామ్   •   పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •  

అమ్మ మాట అంగన్వాడి బాట

11-06-2025 06:47 PM

జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలి..

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్..

కామారెడ్డి (విజయక్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క(Minister Seethakka) ఆదేశాల మేరకు అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని బుధవారం కామారెడ్డి జిల్లాలో దోమకొండ ప్రాజెక్ట్ మాచారెడ్డి అంగన్వాడీ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లలకి ఎగ్ బిర్యానీ వండి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కిచెన్ గార్డెనింగ్ లో భాగంగా బీర, సొర, కాకర వంటి తీగజాతి మొక్కలను జిల్లా కలెక్టర్ నాటారు. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి అంగన్వాడీ సెంటర్లో న్యూట్రి గార్డెన్ కిచెన్ గార్డెన్ల ఏర్పాటు చేసుకోవాలని, పిల్లల పౌష్టికాహారం ఉద్దేశించి పోషణ అభియాన్ లో సరైన డేటా ఇవ్వాలని బాలింతలు, గర్భవతులు పౌష్టికాహారాన్ని విధిగా స్వీకరించాలని దీనికి తగిన ఏర్పాట్లు అంగన్వాడి అధికారులు టీచర్లు సంబంధిత అధికారులు తమ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలని ఇందుకుగాను సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీ స్కూల్ పిల్లలు 100% అటెండ్ అయ్యేలాచుడాలని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పిల్లలతో ఏబీసీడీ చెప్పించారు. అనంతరం అంగన్వాడి పిల్లలతో సెల్ఫి విత్ అంగన్వాడీ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎంపీడీవో, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.