13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

అంబిఫిబియస్ ఎక్స్‌కవేటర్ ప్రారంభం

31-03-2026 01:15 AM

చెరువుల పునరుద్ధరణకు హెచ్‌ఎండీఏ కొనుగోలు

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): హైదరాబాద్ మహానగర అభివృద్ధి సం స్థ (హెచ్‌ఎండీఏ) చెరువలు పునరుద్ధరణ, సంరక్షణ కార్యక్రమాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు అత్యాధునిక అంబి ఫిబియస్ ఎక్స్‌కవేటర్‌ను రూ.2.87 కోట్ల వ్య యంతో ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేసింది. ఈ యంత్రాన్ని సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్, ఖైరతాబాద్ ఎమ్మె ల్యే దానం నాగేందర్ అధికారికంగా ప్రారంభించారు.

హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు వెంకన్న, జెఎంసీ (క్యూర్), బి రవీందర్, చీఫ్ ఇంజనీర్, వి.వి.వి.ఎస్. అప్పారావు, సూపరింటెండింగ్ ఇంజనీర్, వి. శ్రీనివాస్, ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్, డివిజన్3,  పాల్గొన్నారు. అంబిఫిబియస్ ఎక్స్‌కవేటర్ నీటితో నిండిన, మడుగు ప్రాంతాల్లో పనిచేసేలా ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది.

సరస్సుల అడుగుభాగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించవ చ్చు. బండల బలోపేతం, నీటి మొక్కల తొలగింపు, చెత్త, స్లడ్జ్ తొలగింపు, పాత చెరువుల పునరుద్ధరణ వంటి కార్యక్రమాల్లో విస్తృతంగా వినియోగించబడుతుంది. హుస్సేన్ సాగర్ పరిస్థితిని మెరుగుపరచడంలో ఈ యంత్రం కీలక పాత్ర పోషించనుంది.