అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి
09-04-2026 12:44 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 33 వ వార్డులో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని 33వ వార్డు కౌన్సిలర్ బీ.అజయ్ సారధి రెడ్డి సిడిపిఓ శిరీష కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 వ వార్డులో గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చంటి పిల్లలకు అంగన్వాడీ కేంద్రం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారని, తక్షణమే అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వెలుగు శ్రావణ్, నీలం వెంకటేశ్వర్లు, గాదం ప్రసాద్ యాదవ్, పడిదల కవిత, ఎండి హలీమా, జలీల్ ఖాన్, యూసుఫ్ పాల్గొన్నారు.




