29 May, 2026 | 1:28 AM

అదనపు భారం.. అందని వేతనం!

29-05-2026 12:45 AM

ఇబ్బందులు పడుతున్న ఫీల్ అసిస్టెంట్లు

వేతనాలు పెంచి, సకాలంలో చెల్లించాలని వేడుకోలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే 28: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించే ఉ పాధి హామీ పథకంలో కీలకపాత్ర పోషించే క్షేత్ర సహాయకుల(ఫీల్ అసిస్టెంట్) కు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అదనపు భారం మరోవైపు సకాలంలో జీతాలు రాక అవస్థల పాలవుతున్నారు.

జాజిరెడ్డిగూడెం మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఫీల్ అసిస్టెంట్లు ఉన్నారు. మిగిలిన 7 గ్రామపంచాయతీలకు లేరు. దీంతో ప్రస్తుతం ఉన్న వారిపైనే అదరపు భారం పడుతుంది. ఒక్కో ఫీల్ అసిస్టెంట్ రెండు గ్రామపంచాయతీలను చూడాల్సి న పరిస్థితి నెలకొంటుంది. దీంతో వారిపై అదనపు భారం పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సకాలంలో వేతనాలు రాక... 

మండలంలో పనిచేస్తున్న కొందరు ఫీల్ అసిస్టెంట్లకు 5 నెలలు,మరికొందరికి 3 నెలల వేతనాలు రావాల్సి ఉంది. ఇప్పటికే తక్కు వ వేతనంతో ఇబ్బందులు పడుతుండగా వచ్చే వేతనాలు కూడా సకాలంలో అందక కుటుంబ పోషన భారమై సతమతమవుతున్నారు.

2006లో నియామకమై నప్పటి నుంచి వీరి జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదని, అరకొర వేతనాలతో నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే కొద్ది పాటి జీతం కూడా సకాలంలో రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. తమకు వేత నాలు పెంచి,పెండింగ్ వేతనాలను చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

వేతనాలు అందక ఇబ్బందులు

ఓవైపు పని భారం పెరగడం తో పాటు మరోవైపు వేతనాలు స కాలంలో అందక ఇబ్బందులు పడుతున్నాం. మండలంలో  7 ఫీల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండగా ఉన్న వారిపై అదనపు భారం పడుతుంది.పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించి,వేతనాలు పెంచి ఆదుకోవాలి.

బుడిగె లింగయ్య

(ఫీల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి)