29 July, 2026 | 12:48 AM

ఆప్యాయతకు చిరునామా.. సేవలకు నిదర్శనం: ఈవో రమాదేవి

29-07-2026 12:00 AM
  1. దివ్యాంగ మహిళకు ప్రత్యేక దర్శనం
  2. కుటుంబ సభ్యులకు భోజన సదుపాయం

వేములవాడ, జులై 28, (విజయ క్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ఈవో రమాదేవి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆలయ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శనానికి వచ్చిన ఓ దివ్యాంగ మహిళను గుర్తించిన ఈవో రమాదేవి, ఆమెకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దర్శనం కల్పించేలా అధికారులను ఆదేశించారు.

అనంతరం దివ్యాంగ మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఆలయ ఆధ్వర్యంలో భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక అవసరాలు ఉన్న భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, అవసరమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆలయ అధికారులు చర్యలు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.భక్తుల పట్ల ఈవో రమాదేవి చూపిన ప్రత్యేక శ్రద్ధ, సేవాభావంపై పలువురు అభినందనలు వ్యక్తం చేశారు.