29 July, 2026 | 1:04 AM

నేడు ఖమ్మంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పర్యటన

29-07-2026 12:00 AM

ఖమ్మం, జూలై 28 (విజయక్రాంతి): జమ్మూ & కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. అందులో భాగంగా ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వచ్చి ఖమ్మం కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరలో ఎన్‌ఎస్పీ కాలనీలోని నూతన శివాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం 12.15 గంటలకు వెలుగు మట్లలోని ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. తర్వాత మధ్యాహ్నం 3.20 గంటలకు ఖమ్మం రూరల్ మండలం, గొల్లగూడెం గ్రామంలోని నామ ముత్తయ్య వరమ్మల స్మృతి వనాన్ని సందర్శించి నివాళులర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు.