ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజం
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ రాజేంద్రప్రసాద్
భూపాలపల్లి టౌన్, జులై 28 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరిండెంట్ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆసుపత్రిలో మూడు సంవత్సరాలు నర్సింగ్ సూపరిండెంట్గా పనిచేసి పదోన్నతిపై కొత్తగూడెంకు గ్రేడ్ వన్ నర్సింగ్ ఆఫీసర్గా బదిలీ అవుతున్న జెస్సీబ్యులా, అలాగే హెడ్ సిస్టర్ జ్యోతి వరంగల్ ఎంజిఎంకు బదిలీ కావడంతో, గ్రేడ్ వన్ నర్సింగ్ సూపరిండెంట్ ఉమేశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఉద్యోగుల్లో బదిలీలు, పదవీ విరమణలు సహజమని, ప్రజలతో మమేకమై విధులు నిర్వహిస్తే మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరిండెంట్ వెంకటరత్నం, ఆర్ ఎం ఓ రాజేష్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ యాదగిరి, ఏఓలు, ఆఫీస్ సూపరిండెంట్లు సమ్మయ్య, హబీబ్, నర్సింగ్ సూపరిండెంట్లు జయలక్ష్మి, స్వర్ణలత, నర్సింగ్ ఆఫీసర్లు, ఫార్మసిస్టులు స్వప్న కుమారి, సుప్రియ, పున్నం, రికార్డు అసిస్టెంట్ కృష్ణ, డాటా ఆపరేటర్, ఈసీజీ టెక్నీషియన్ రాజేంద్రప్రసాద్, ఎక్స్రే టెక్నీషియన్ వెంకట్, సదరన్ క్యాంప్ డాటా ఆపరేటర్లు గౌతమ్, ప్రశాంత్, ఆరోగ్యశ్రీ డాటా ఆపరేటర్లు బాలరాజు, కిరణ్, సత్యం, అశోక్, అంబులెన్స్ డ్రైవర్ సంతోష్, ఎలక్ట్రిషన్ సతీష్, ఎమ్‌ఎన్వోలు రాజు, రాజపోశయ్య, శానిటేషన్ సూపర్వైజర్ రాజకుమార్, సెక్యూరిటీ, పేషంట్ కేర్ సిబ్బంది, స్లీపర్లు పాల్గొన్నారు.






