25-07-2025 12:18:10 AM
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): నీటిపారుదల శాఖలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీర్ల నిరీక్షణకు తెరపడింది. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న 127 మంది ఏఈఈలు పదోన్నతులు పొందారు. పదోన్నతుల కోసం ఏఈఈలు గడిచిన 18 ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. ఈ సమస్యను నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పరిష్కరించారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోక్యంతో ఎట్టకేలకు ఏఈఈలకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ఇంజినీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏఈఈల ప్రతినిధుల బృందం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.